గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.
ఇనుప దారి
Jump to navigation
Jump to search
ఇనుప దారి (లేదా ఇనుపదారి) అనే పదబంధం రైల్వే మార్గం అన్న అర్థంలో వాడుకలో ఉంది.
వాడుకలు
- 1835: కాకియైనది ఒక గంటలో 25 మైళ్ళు ఎగురుచున్నదట. చెన్నపురి ఇనుపదారి వేగము ఇంతియే! — సత్యదూత పత్రిక (తొలి తెలుగు పత్రికలు వ్యాసం)
- 1934: ఇది చెన్నపురి దక్షిన మహారాష్ట్రపు ఇనుపదారి యొక్క గుంతకల్లు - బెంగుళూరుశాఖమీద నొకస్టేషను. — కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (అనంతపురము వ్యాసం, ఆంధ్ర విజ్ఞాన సార్వస్వం)
- 2013: రైలింజను ఈలపాటకు ముడుచుకుని / మందలా ఇనుపదారి ఆవరణలో / జరగాల్సొచ్చేది — ముకుంద రామారావు (అన్నా అఖ్మతోవా)
- 2012: పంగిడి గూడెం నుంచి, ఏలూరు కాలువ మీదుగా, భీమడోలు దాకా స్వంత ఖర్చుతో, ఇనుప దారి నిర్మించి, ప్రయాణం సౌకర్యవంతం చేశాడు. — గబ్బిట దుర్గా ప్రసాద్ (వల్లూరు సంస్థానం - 2)
- 2014: ఇలా కాపలా లేని ఈ ఇనుప దారి గవాక్షం వద్ద గతంలో అనేకసార్లు రైళ్లు వాహనాలను ఢీకొనడం చరిత్ర! — పట్టాలపై శిశుమేథం..., ఆంధ్రభూమి సంపాదకీయం 25/07/2014