గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

పన్ను

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

1 ఆహారాన్ని కొరకడానికి, నమలడానికి ఉపయోగించే నోటి లోని తెల్లని, గట్టి నిర్మాణాలలో ఒకటి. దంతం.

  • నిన్న ఒక పన్ను ఊడిపోయింది.
బహు. పళ్ళు, పండ్లు
విశేషణ రూపం: పంటి.
  • పంటి నొప్పి
  • పంటి గాట్లు

2 ప్రభుత్వం ప్రజా సౌకర్యాలను అందించేందుకు వ్యక్తులు లేదా సంస్థలు తమ ఆదాయంపై, లాభాలపై లేదా పొందే సేవలపై ప్రభుత్వానికి చెల్లించాల్సిన పైకం.

  • ఊఁ, సంపాదించినదంతా పన్నులకే పోతుంది!
బహు. పన్నులు
విశేషణ రూపం: పన్ను.
  • ఆదాయపు పన్ను శాఖ
  • పన్ను వసూళ్ళు
  • పన్నుపోటు

3 ఏదైనా వస్తువు నుండి చిన్నగా పౌడుచుకు వచ్చిన భాగం.

  • పళ్ళ చక్రం
  • రంపపు పళ్ళు
బహు. పళ్ళు, పండ్లు

4 పన్ (pun). ఒక పదాన్ని పలు అర్ధాలు వచ్చేలా చతురతతో ఉపయోగించడం. శ్లేష.

  • 'ఎన్నో పన్నులు' అన్న దానిలో పన్నులు అన్న పదం చెల్లించే పన్నులను, చతురుగా వాడే పన్నులను మరియు పన్ను అన్న పదానికి వివిధ అర్థఛాయలను సూచిస్తుంది.
బహు. పన్నులు

5 (క్రియ) కూర్చు, తయారుచేయు, కల్పించు.

  • తెలంగాణకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు.
  • సదరు సిఐను రెడ్డుహ్యాండెడుగా పట్టుకునేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్నారు.
"https://telugupadam.org/index.php?title=పన్ను&oldid=3512" నుండి వెలికితీశారు