గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.
Phrasal
వ్యవహార భాషలో ఉన్న శబ్దపల్లవాలను (verbal phrases) ఇక్కడ పొందుపరుద్దాం. ఇలాంటి సమాస-పదకోశం ఆంగ్ల భాషలో చాలా ఉన్నాయి [1]. అనుగుణంగా, మన తెలుగుకి కూడా ఒకటి మనం కూడా తయారుచేద్దాం. ఈ సమాసాలను (compounds) తయారు చెయ్యడానికి క్రియాపదాలకి (verbs) వేరు క్రియాపదాలు (verbs), లేదా నామవాచకాలు (nouns), లేదా ఉపసర్గలు (prepositions) కలిపివాడండి. ఇప్పటికే వాడుకలో ఉన్నవి, కొత్తగా మీరు కనిపెట్టినవి కూడా అన్నీ సూచించండి. ఎక్కడన్నా మరిచిపోతే, మూల క్రియాపదాలు కూడా ఏడ్ చెయ్యండి. ఉదాహరణకి ఇంగ్లీషులో give in, bring in, take off, give up మొదలైనవి.
ఉపసర్గల లిస్టు :
లో (in), పై (up), బయట (out), ముందు (front), వెనుక (back), మీద (over), కింద (under), వైపు (towards), నుండి (from), నడి/నడుమ (between), బయలు (out), కడ (last), వద్ద (at) ..
సరి (correct), ఎదురు (opposite) కూడి (gather) ఇచ్చి (give) విడు (leave) అడ్డి (stop) కూర్చి (build) అట్టి (along)
సంస్కృత ఉపసర్గలు తెలుగువాడుకలో ఉన్నవి :
1. అప - తప్పుడుగా, మినహాయింపుగా, వేరే దారిలో 2. ఉప - అనుకూలంగా, సుఖంగా, మంచిగా, దగ్గరగా 3. అభి - ఎదురుగా 4. అవ - తక్కువగా 5. అతి - దాటి, మించి, మీరి 6. అను - వెనువెంటనే, తరువాత, అనుసరించి, పోలి ఉండే విధంగా 7. ఆ - మొదటి నుంచి చివరి దాకా 8. ని - లోపల (ని + ద్రా = తన లోపలికి తానే పరుగెత్తడం) 9. నిర్/నిస్ - బయటికి, లేకుండా 10.అధి - మీద, పక్కన 11.సు - మంచిగా, చక్కగా, నేరుగా 12.దుర్/దుస్ - చెడ్డగా 13.ప్ర - గొప్పగా 14.ప్రతి - ప్రత్యామ్నాయంగా, విరోధంగా, ఎదురుగా, తిరిగి, ఒక్కొక్కటి 15.వి - వేరుగా, లేకుండా, మరో విధంగా, మరో దిశలో 16.సం - కలిసి, మొత్తంగా, ఉత్తమంగా 17.పరా - అవతల 18.పరి - చుట్టూ 19.పి/అపి - రహస్యంగా, కప్పి ఉంచి 20.ఉత్/ఉద్ - పైకి
సుడికారాలు (idioms) ఇక్కడ రాయవద్దు. వాటికోసం ఇంకో పేజి సృష్టిద్దాం. ఉదాహరణకి "చేతులు పైకెత్తు" అన్నది జాతీయం. శబ్దపల్లవాలు (verbal phrases) సాధారణంగా తెలుగులో ఒకేపదంగా వ్రాస్తాం, సుడికారాలు అలాగ కాదు.
అంటు
(to stick)
అడుగంటు (bottom + stick) : to sediment
పట్టిక కలిపిన తరువాత నీళ్ళలోని మట్టి అడుగంటింది.
అడుగు
(to ask)
ఆడు
(to play)
తొణికిసలాడు (sparkle+play) : to sparkle
రాష్ట్రపతి రాక సందర్భంగా నగరమంతా స్వాగత తోరణాలతో తొణికిసలాడుతోంది
అను
అమ్ము
అరువు
ఇవ్వు/ఇచ్చు
ఎంచు
ఎక్కు
ఎత్తు
ఏడు
కక్కు
కొట్టు
(to hit)
పడగొట్టు (fall + hit) : to bring down, to destroy
గవర్నమెంటుని పడగొట్టడానికి ప్రతిపక్షాలు అసమ్మతి నాయకులతో చర్చలు ప్రారంభించాయి.
వెళ్ళగొట్టు, బయటికి పంపించు
కూడు
(to sum, to gather)
కూడబెట్టు (gather + put) : to save (as savings)
పదేళ్ళుగా కూడబెట్టిన డబ్బులన్నీ కూతురి పెళ్ళికి ఖర్చుపెట్టేసాడు.
కను
(give birth to)
కనుగొను (give birth to + buy) : discover
కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు
కనిపెట్టు (give birth to + put) : invent
ఎడిసన్ బల్బుని కనిపెట్టాడు
కొను
కోరు
కలుపు
గెంతు
గెంటు
చూడు
(to see)
చూసిపెట్టు (see + put) : to supervise, to help
మావాడికి మంచిగా చదువు అబ్బేట్టట్టు చూసిపెట్టండి మాష్టారూ.
సరిచూడు (correct + see) : to inspect
మీ ఆట సరిచూసిన తరువాత నేనివ్వగలిగే సలహాలు ఇంకేమీలేవు.
చూసిదిద్దు (see + correct/copy) : to correct (an examination script)
ఈ పేపర్లు చూసిదిద్దటానికి ఉన్న టైమంతా పట్టేసింది.
చెప్పు
అప్పజెప్పు
చేయు
పాడుచేయు, చెడుపు
తాకు
తగులు
తెచ్చు
(to bring)
తెచ్చిపెట్టు (bring + put) : to provide
ఈ ఆస్తి ఏమీ తాతలు తెచ్చిపెట్టినది కాదు, స్వయంకృషితో సంపాదించినది.
తిప్పు
మెలిదిప్పు
దించు
దిగు
నక్కు
నొక్కు
నొక్కివక్కాణించు
నాటు
నడువు
పంచు
పొందు
పండు
పట్టు
(to catch)
చేపట్టు (hand + catch) : to start, to do (an endeavour)
ప్రభుత్వం చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనివ్వాలంటే ప్రజలు తోడ్పాటునివ్వాలి.
పెట్టు
(put)
కట్టిపెట్టు (tie + put) : to stop, to shut up
వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్.
తలపెట్టు (head + put) : to conceptualize, to begin
వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్
పంచిపెట్టు (distribute + put) : to distribute, to share
పుట్టినరోజు కాబట్టి బాలు అందరికీ చాక్లెట్లు పంచిపెట్టాడు
అట్టేపెట్టు (in the same manner + put) : to store, to keep for future use
దీపావళిలో కాల్చగా మిగిలిపోయిన మతాబుల్ని నాగులచవితి కోసం అట్టేపెట్టారు.
పడు
పాడు
పరుచు
పారు
మెక్కు
ముడువు
మూయు
(to close)
కనుమూయు (eye + close) : to die
మదర్ థెరీసా కనుమూసిన వేళ దేశమంతా విలపించింది.
మార్చు
మలుచు
వండు
వచ్చు
వాడు
విడు
(to separate)
విడగొట్టు (separate + hit) : to divide
హంస పాలనుండి నీటిని విడగొట్టినట్టు, సమాజంలో మంచినుండి చెడుని విడగొట్టేవాడు నేర్పరి.
విను
వేయు
(to drop, to throw, to place)
తోడేయు (draw/lift + drop) : to curdle, to suck (energy)
పాలు తోడెయ్యడం మర్చిపోయాను, ఇంట్లో ఇప్పుడు పెరుగు లేదు
ఈ ఎండ వంట్లోని సత్తువంతా తోడేస్తోంది
లాగు
దిగలాగు, క్రిందికి లాగడం
బిగలాగు, (రెండు తాళ్ళు పట్టుకుని) బిగువు చేయడం
లేచు
వంపు/వంచు
వేడు
వేయు
వలుచు
తిరుగు
వెనుదిరుగు: వెనుకకు వచ్చు