గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

పచ్చిగాలి

తెలుగుపదం నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పచ్చిగాలి అనే పదం తాజా, స్వచ్ఛమైన గాలి (fresh air) అనే అర్థంలో వాడుకలో ఉంది.

వాడుక

  • 1975: అబ్బా సెగెట్రీ! ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి, ఆ పెత్తెచ్చ నారాయణుడి సేవ సేసుకోవద్దూ? — రమణ (ముత్యాలముగ్గు సినిమాలో రావుగోపాలరావు డైలాగు)
  • 1992: … పెంకితనాల పచ్చిగాలి ఇదేనా పొద్దుపోని ఆ ఈల ఏ గాలి ఆలాపన — సిరివెన్నెల సీతారామశాస్త్రి (అల్లరి మొగుడు సినిమాలో “రేపల్లె మళ్ళీ మురళి విన్నది” పాటలో)
  • 2010: సాయంత్రం పచ్చిగాలి పీల్చుకోగోరే వారికి దర్శనీయ స్థలంగా ఉండేది. — డా॥ వి.రామకృష్ణ (ఆంధ్రప్రభ పత్రికలో “ఎవరిదీ నేరం” వ్యాసం)
  • 2010: చలికాలపు ఉదయం! కొండల మీద మబ్బుల గుంపులు దిగాయి. చుట్టూ అందంగా పచ్చగా కొండలూ లోయలూ, వీస్తోన్న పచ్చిగాలి… హృద్యంగా ఉంది వాతావరణం. — ఆదిలక్ష్మి (అమ్మఒడి బ్లాగు)
  • 2011: పచ్చిగాలి కోసం (కథ) — డా॥పమిడిఘంటం సుబ్బారావు (ఆంధ్రభూమి పత్రికలో "పచ్చిగాలి కోసం" కథ)
  • 2012: కాలుష్యం అంటూ సోకని పచ్చిగాలి పీల్చి ఎన్నాళ్లయిందో ఒక్కసారి ఆలోచించండి. పల్లె అయినా, పట్టణమైనా కాలుష్యం కోరల్లో పడి విలవిలలాడుతున్న రోజులివి. — వి.ఎస్.ఎన్.మూర్తి (ఆంధ్రభూమి)
  • 2013: ఎప్పుడైతే నేల మీద కాలు మోపినదో గాని పైసా / పచ్చిగాలి మానేసి దాన్నే పీల్చుకుంటోంది శ్వాస - సిరివెన్నెల సీతారామశాస్త్రి (పైసా సినిమాలో పాట)
"https://telugupadam.org/index.php?title=పచ్చిగాలి&oldid=3487" నుండి వెలికితీశారు