గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.
మొదటి పేజీ
తెలుగుపదం గూటికి స్వాగతం!
కొత్త పదాల సృష్టి, అందుకు కావలసిన సముదాయిక చర్చా వాతావరణాన్ని కల్పించడం తెలుగుపదం యొక్క ప్రధాన లక్ష్యం. ఔత్సాహికులు కొందరు (తమతమ బ్లాగులలో, సందేశాల్లో) వివిధ ఆంగ్ల భాషా పదాలకు తెలుగు పదాలను సృష్టిస్తున్నారు. వీటన్నింటినీ ఒక దగ్గర క్రోడీకరించడం కూడా ఒక అనుబంధ లక్ష్యం.
ఇది నిఘంటువు కాకపోయినా, ఇక్కడున్న తెలుగు పదాల్ని వాడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ పోగయ్యే పదసంపద అంతా అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రయత్నంలో మిమ్మల్నికూడా పాలుపంచుకోమని ఆహ్వానిస్తున్నాం.
కొత్త తెలుగుపదాల కొరకు అభ్యర్ధనలు, సందేహాలు, మీ ప్రతిపాదనలు తెలుగుపదం గూగుల్ గుంపులో చర్చించవచ్చు. తెలుగు పదాలు సృష్టించడానికి ఉపయోగపడే వనరులను చూడండి.
మరిన్ని వివరాలకు తరచూ వచ్చే సందేహాలు చూడండి.
ఇటీవలి చర్చలు