గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:మార్గదర్శకాలు/ఆంగ్ల పదాలు ఏర్పడిన రకాలు

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

తెలుగులో కొత్త పదాల కల్పన చేసేటప్పుడు ఇంగ్లీషు పదాల్ని మక్కికి మక్కి దించుకోవడమో, అనువదించడమో కాక, ఇంగ్లీషులో పదాలు ఏర్పడిన విధానాన్ని ముందు సమగ్రంగా అధ్యయనం చేసి ఆ పద్ధతుల వెలుగులో తెలుక్కి వర్తించే సూత్రాల్ని ఏర్పఱచుకోవాలి. నా పరిశీలనలో ఇంగ్లీషు పదాలు చారిత్రికంగా స్థూలంగా రెండు రకాలుగా ఏర్పడ్డాయి.

అచ్చ ఇంగ్లీషు పదాలు

అచ్చ ఇంగ్లీషు పదాలు నాలుగు రకాలుగా ఏర్పడ్డాయి.

జెర్మానిక్ పదాలు

తోటి జెర్మానిక్ భాషలైన డచ్, జర్మన్ భాషలతో పోలికలు గల ఇంగ్లీషు పదాలివి. ఉదా :- friend, thanks, good, God, church, round, free మొదలైనవి.

ఆంగ్లో-శాక్సన్ పదాలు

మొదట్లో Angles అని పిలవబడ్డ ఆదిమ ఇంగ్లీషు వలసదార్లు ఇంగ్లండులోని స్థానిక శాక్సన్ జాతివారితో సమ్మేళనమై మాట్లాడనారంభించిన భాష.

కెల్టిక్/గేలిక్ పదాలు

ఇంగ్లీషుకు పరిసర భాషలైన వెల్ష్, స్కాటిష్, ఈరిష్ భాషల ప్రభావంతో ఇంగ్లీషులోకి వచ్చి చేరిన పదాలు.

నోర్డిక్ పదాలు

వైకింగులు ఇంగ్లండుని పరిపాలించిన కాలంలో వచ్చి చేరిన పదాలు.

ఆదానాలు

ఇంగ్లీషులో రెండో అతిపెద్ద శబ్దవర్గమైన ఆదాన పదాల్ని కూడా 4 రకాలుగా వింగడించవచ్చు.

ప్రామాణిక ఆదానాలు (Learned Borrowings)

సంస్కృత ప్రాకృత భాషల పదాల్ని తెలుగు గ్రహించినట్లే మత, మతేతర కారణాల వల్ల ముఖ్యంగా పునరుజ్జీవన (Renaissnace) కాలంలో లాటిన్, గ్రీకు పదాలు ఇంగ్లీషుని ముంచెత్తాయి. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

చారిత్రిక ఆదానాలు

తెలుగు ఉర్దూ రాజుల ప్రభావానికి లోనైనట్లే, ఇంగ్లండుని నార్మన్ రాజులు పరిపాలించిన కాలంలో ఇంగ్లీషు ఫ్రెంచి ప్రభావానికి గురైంది. ఫ్రెంచివారిని అనుకరిస్తూ ఇంగ్లీషువారు కూడా పదాల చివర ఒక అనవసరమైన e చేర్చి రాయసాగారు. ఉదా :- wyf కాస్తా wife అయింది.

సామ్రాజ్య ఆదానాలు

ఇంగ్లీషువారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో తమ రాజకీయాధికారాన్ని స్థాపించినప్పుడు స్థానిక భాషలు నేర్చుకోవడం, వాటిలోంచి అవసరమైన పదాల్ని గ్రహించడం జరిగింది.

ఇది తెలుగుని ఇంగ్లీషుతో పోల్చడానికి కాదని అర్థం చేసుకోవాలి. చాలామంది ఆ పొఱపాటు చేస్తారు. నార్మన్ రాజుల కాలంలో తప్ప మిగతా అన్ని కాలాల్లోను ఇంగ్లీషు ఒక దేశానికి అధికార భాషగా ఒక హోదాని వెలగబెడుతూ వచ్చింది. ఒక దేశానికి జాతీయభాషగా రాజపోషణకీ, దాని ద్వారా ప్రజాపోషణకి అది నోచుకుంది. అందుచేత అది ఎన్ని భాషల ప్రభావానికి లోనైనా తన అస్తిత్వానికి ప్రమాదం రాలేదు. తెలుగు పరిస్థితి పూర్తి విరుద్ధం. విజయనగర సామ్రాజ్యం అంతరించాక (క్రీ.శ. 1665 ప్రాంతం) ఒక అధికార భాషగా తెలుగు యొక్క అధ్యాయం ముగిసిపోయింది. అయినా ఇప్పటి దాకా ఈ భాష బతికే ఉండడం గొప్ప సర్కస్ ఫీటే. అందుచేత తెలుగు భాషాభిమానం భాషోన్మాదమూ కాదు. విశాలాంధ్ర భావన సామ్రాజ్యవాదమూ కాదు.

అన్యాయానికి గురైన తెలుగు భాషని నిలబెట్టుకోవడమే మన లక్ష్యంగా ఉండాలని, ఆ క్రమంలో భాషని మింగేసే చర్యలకి పాల్పడకూదదనీ, అంతిమంగా మనం మన తెలుగు వ్యాప్తికే ఉపయోగపడాలి తప్ప ఇతర భాషల భుజకీర్తులకు మెఱుగులు దిద్దే కార్యక్రమంలో పాలుపంచుకోకూడదనీ చెప్పడానికే ఇదంతా రాశాను.


<< మార్గదర్శకాలు