గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:మార్గదర్శకాలు/తెలుగులో విశేషణాలు

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

విశేషణాల (adjectives) నిష్పాదన భాషలో చాలా పెద్ద విభాగం. ఎందుకంటే ఏ రోజు ఏ పదాన్ని విశేషణంగా మారుస్తామో మనకే తెలియదు కనుక. అందుచేత ఈ విభాగాన్ని మిగతా నిష్పాదన ప్రక్రియల కన్నా ఎక్కువ శ్రద్ధగా అధ్యయనం చెయ్యాల్సి ఉంటుంది. ఇందులో ప్రాథమిక సమస్యలు ఏవంటే—

 1. ఏ పదాన్ని విశేషణంగా మార్చాలో తెలియకపోవడం
 2. ఎలా మార్చాలో తెలియకపోవడం (సాధారణంగా ఏదో ఒక పద్ధతి మాత్రమే తెలిసి ఉంటుంది)
 3. మార్చాక దానికి ఏమని అర్థం చెప్పుకోవాలో తెలియకపోవడం
 4. ఒక పదం నుంచి ఎన్ని విశేషణాలు మనకు అవసరమౌతాయో కూడా తెలియకపోవడం

ఏ పదాన్ని విశేషణంగా మార్చాలి?

మన భాషలో క్రియాధాతువుల్నీ నామవాచకాల్నీ విశేషణాలుగా మార్చే సౌకర్యం ఉంది. అంటే సర్వనామాల్ని అవ్యయాల్ని క్రియారూపాల్ని విభక్తి ప్రత్యయాల్ని ఉపసర్గల్ని విశేషణాలుగా మార్చలేమని అర్థం.

ఎలా మార్చాలి?

ఇది మనం ఏ అర్థంలో విశేషణాన్ని నిష్పాదించబోతున్నామనేదానిమీద ఆధారపడి ఉంది. మన చర్చకు కేంద్రబిందువు ఈ ప్రస్తావనే. దీన్నే తరువాతి భాగాల్లో విపులంగా చర్చిస్తాం.

ఒక పదం నుంచి ఎన్ని విశేషణాలు అవసరమౌతాయి?

ఎన్నయినా అవసరమౌతాయి. ఇన్ని అని ఇదమిత్థంగా నిర్ధారించడం కష్టం. అయితే విశేషణాలు చాలావరకు ఈ క్రింది అర్థాల్లో ఏర్పడతాయి:

 1. సంబంధించిన/ చెందిన
 2. కలిగించే
 3. జనించే
 4. కూడిన
 5. నిండిన మొ.

సందర్భాన్ని బట్టి ఇలా ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పదం యొక్క చివరి భాగానికి ఏ క్రియాధాతు రూపాన్నయినా చేర్చి విశేషణాన్ని నిష్పాదించినప్పుడు. ఉదా.:

 • ఉపయోగకరం (ఉపయోగ + కృ ) = ఉపయోగం చేసేది
 • మనోహరం (మనస్ + హృ) = మనస్సుని హరించేది
 • జలచరం (జల + చర) = నీటిలో సంచరించేది మొ.

అయితే ఇక్కడ మన ముందున్న సవాలు సంస్కృత విశేషణాలు కాదు. ఇంగ్లీషులో ఉన్న విశేషణాలకు దీటుగా అందరికీ ఆమోదయోగ్యం అయ్యేలా అందరికీ అర్థమయ్యేలా అంతులేని విధంగా విశేషణాల్ని రూపొందించగల సామర్థ్యం అందరికీ అలవడేలా చెయ్యడం మనక్కావాలి.

<< మార్గదర్శకాలు