గమనిక: ఈ వికీలో అనామక మార్పులను నిషేధించాం. మీకో ఖాతా సృష్టించుకుని మార్పులు చేయండి.

తెలుగుపదం:మార్గదర్శకాలు/సంస్కృత ఉపసర్గలు

తెలుగుపదం నుండి
Jump to navigation Jump to search

తెలుగులోని చాలా క్రియాధాతువుల ముందు ఇప్పటికే వాడుతున్న ఉపసర్గల్ని వాటి అర్థాల్ని పరిశీలించండి. అవి ప్రాథమికంగా 20. అయితే కాలక్రమేణ తరువాత్తరువాత ఇంకొన్ని పదాలు కూడా ఉపసర్గల్లా ప్రవర్తించడం (క్రియాధాతువులకు ముందొచ్చి చేరడం) మొదలుపెట్టాయి.

 1. అప - తప్పుడుగా, మినహాయింపుగా, వేరే దారిలో
 2. ఉప - అనుకూలంగా, సుఖంగా, మంచిగా, దగ్గరగా
 3. అభి - ఎదురుగా
 4. అవ - తక్కువగా
 5. అతి - దాటి, మించి, మీరి
 6. అను - వెనువెంటనే, తరువాత, అనుసరించి, పోలి ఉండే విధంగా
 7. - మొదటి నుంచి చివరి దాకా
 8. ని - లోపల (ని + ద్రా = తన లోపలికి తానే పరుగెత్తడం)
 9. నిర్/నిస్ - బయటికి, లేకుండా
 10. అధి - మీద, పక్కన
 11. సు - మంచిగా, చక్కగా, నేరుగా
 12. దుర్/దుస్ - చెడ్డగా
 13. ప్ర - గొప్పగా
 14. ప్రతి - ప్రత్యామ్నాయంగా, విరోధంగా, ఎదురుగా, తిరిగి, ఒక్కొక్కటి
 15. వి - వేరుగా, లేకుండా, మరో విధంగా, మరో దిశలో
 16. సం - కలిసి, మొత్తంగా, ఉత్తమంగా
 17. పరా - అవతల
 18. పరి - చుట్టూ
 19. పి/అపి - రహస్యంగా, కప్పి ఉంచి
 20. ఉత్/ఉద్ - పైకి

ఇప్పటికే ఈ ఉపసర్గలు చేరి ఉన్న పాతపదాలతో అర్థ విరోధం రాకుండా కొత్త పదాలు కల్పించాలి. రెండు మూడు ఉపసర్గల్ని ఒకేసారి ఒకే ధాతువుకు చేర్చడం కూడా వ్యాకరణ సమ్మతమే. వేదకాలంలో వీటిని వాక్యంలో ఎక్కడ పడితే అక్కడ చేర్చేవారు, ఇప్పటి ఇంగ్లీషులో లాగా (అహం ఆగచ్ఛామి - నేను వస్తున్నాను అనడానికి "ఆ అహం గమిష్యామి అనేవారు). కావ్యయుగంలో ఇవి క్రియాధాతువుల ముందే స్థిరపడ్డాయి.

కాలక్రమంలో ఈ కింది పదాల్ని కూడా ఉపసర్గలలా వాడడం మొదలుపెట్టారు.

 1. కు - కొంచెం, చిన్న, తక్కువ, నీచం, హీనం, చెడ్డగా. ఉదా: కుభోజనం (తక్కువ తినడం), కుగ్రామం (hamlet) మొ.
 2. సకృత్ - అరుదుగా (అసలు అర్థం - ఒక్కసారి అని)
 3. ఆరాత్ - దగ్గరగా
 4. పశ్చాత్ - తరువాత, వెనుక
 5. సహ - కలిసి
 6. పునస్/పునర్ - మళ్ళీ
 7. సాక్షాత్ - ఎట్టెదుట
 8. సదా - ఎల్లప్పుడూ
 9. శశ్వత్ - శాశ్వతంగా
 10. పురస్/పురో - ముందు
 11. తిరస్/తిరో -వెనుక
 12. ప్రాక్ - అంతకుముందు/ఇంతకుముందు, తూర్పుదిక్కు. ఉదా: ప్రాక్-నన్నయ యుగం (pre-nannaya period) ప్రాచీనుడు - ముందటివాడు, ప్రాక్తనం - ప్రాచీనం
 13. అర్వాక్ - ఇంతకు తరువాత. ఉదా: అర్వాక్ నన్నయ యుగం (post-nannaya period) అర్వాచీనుడు - తరువాతివాడు
 14. సమ్యక్ - సరిగా. సమీచీనం - సరిగా ఉన్నటువంటిది.
 15. ఉపరి - పైన
 16. అధస్/అధో/న్యక్ - కింద
 17. ద్రాక్ - త్వరగా
 18. శనైర్/శనైస్ - నెమ్మదిగా (slow)
 19. ఉచ్చైర్/ఉచ్చైస్ - బిగ్గరగా (loudly)
 20. బహు/నానా - ఎక్కువగా, ఎక్కువ
 21. మనాక్/కించిత్/ఈషత్ - తక్కువగా, కొంచెం
 22. సద్యస్/సద్యో - వెనువెంటనే (immediately)
 23. తథ్యం - నిజంగా
 24. మృషా - అబద్ధంగా
 25. ధ్రువం/నూనం/అవశ్యం - తప్పకుండా (sure)
 26. ప్రాయో - తఱచుగా (oft, often)
 27. బహిర్/బహిస్ - బయట
 28. అంతర్/అంతస్ - లోపల
 29. యుగపత్/ఏకదా - రెండూ ఒకేసారిగా (simultaneous)

వీటిని కూడా మనం ఇంకా ఎక్కువ క్రియాధాతువుల ముందు అవసరాన్ని బట్టి చేర్చి సద్వినియోగం చేసుకోవాలి.


<< మార్గదర్శకాలు